Tuesday, 3 November 2026

54 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు

హైదరాబాద్ : వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాలకు వెళ్లే 54 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి ముంబయి, విశాఖ, మచిలీపట్నం, తిరుపతి, షిర్డి, చెన్నై వైపు వెళ్లే పలు ఎక్స్‌ప్రెస్‌లకు అదనంగా బోగీలను పెంచారు. అదనపు బోగీల ద్వారా 86 వేల బెర్త్‌లు అందుబాటులోకి రానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *