హైదరాబాద్ : హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లలో రూ. 600 కోట్ల కుంభకోణం జరిగిందని తెదేపా నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. ఎన్జీఆర్ ట్రస్టు భవన్‌లో ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిధులకోసం అధిష్ఠానం, రవాణా శాఖ మంత్రి, ముఖ్యమంత్రి అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. గుర్తింపు లేని సంస్థకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను అమర్చే పనిని అప్పజెప్పారని ఆరోపించారు. ఢిల్లీ, హర్యానాలో రూ. 250 ఉంటే రాష్ట్రంలో రూ. 650 వసూలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల వల్ల రాష్ట్రంలో 10 వేల మంది ఉపాధి కోల్పోయారని గాలి పేర్కొన్నారు.




