హైదరాబాద్,(జనంసాక్షి): సికింద్రాబాద్లోని రాష్ట్రపతి రోడ్డులో గల సిటీలైట్ హోటల్ భవనం కుప్పకూలిన ప్రాంతాన్ని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నారు. పోలీసు అధికారులను కొనసాగిస్తున్న సహాయచర్యలపై అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా 15 మంది గాయపడిన సంగతి తెలిసిందే.




