పొందూరు,(జనంసాక్షి): శ్రీకాకుళం జిల్లా పొందుతూ రైల్వేస్టేషన్‌లో రైలు కింద పడి ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. మృతుల పొలాకి మండలం బెల్లిమరపాలవలపకు చెందిన కల్లేపల్లి మహేష్ (18), గార్లపాటి రాధ (15) గా గుర్తించారు. మహేశ్ శ్రీకాకుళం ఐటీఐ కళాశాలలో చదువుతున్నాడు. రాధ స్వగ్రామంలో తొమ్మిదో తరగతి చదువుతుంది. శ్రీకాకుళం రైల్వే హెడ్ కానిస్టేబుల్ బి. రామకృష్ణ ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలు పరిశీలించారు.




