Tuesday, 3 November 2026

కొనసాగుతున్న శిథిలాల తొలగింపు

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి రోడ్డులో కుప్పకూలిన సిటీలైట్‌ హోటల్‌ శిథిలాల తొలగింపు ఇంకా కొనసాగుతోంది. హోటల్‌లో పనిచేసే వంట మనిషి, మరో కార్మికుడు కనిపించడంలేదని అధికారులు గుర్తించారు. వారిద్దరూ భవన శిథిలాల్లో  చిక్కుకుని ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కృష్ణబాబు ఆధ్వర్యంలో రెండు ప్రొక్లెయిన్లతో శిథిలాలను తొలగించి, లారీల ద్వారా వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు. సాయంత్రం వరకు శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని కృష్ణబాబు తెలిపారు. జీహెచ్‌ఎంసీ, ఇతర సిబ్బంది శిథిలాల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *