అసోంలో భారీ వర్షాలు నీట మునిగిన 11 జిల్లాలు

అసోం: అసోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బ్రహ్మపుత్ర, జియాదోల్‌ నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. 11 జిల్లాల్లోని దాదాపు 350 గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. దీంతో రవాణా, సమాచారవ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. సుమారు 6వేల ఎకరాల్లో పంటుల దెబ్బతిన్నాయి.