యానాం: యానాంలోని అనంద్ రీజెన్సీ హోటల్ యాజమాని రవిశంకర్ ప్రసాద్ అదృశ్యమయ్యారు. సోమవారం తెల్లవారుజామున వాకింగ్‌కి వెళ్లిన రవిశంకర్ ప్రసాద్ తిరిగి రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు యానాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ షణ్ముఖం మంగళవారం తెలిపారు.




