ఖమ్మం: ఖమ్మం జిల్లా భద్రాచలం మన్యంలోని కూనవరం మండలం మెట్ట రామవరంలో ఆస్తి వివాదం నేపథ్యంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరిగింది. మెట్ట రామవరం గ్రామానికి చెందిన కరక నాగయ్య, చేలభం భద్రయ్య వరుసకు అన్నదమ్ములు, వీరికి భూతగాదా రావడంతో భద్రయ్యపై నాగయ్య బాణంతో దాడి చేశాడు. భద్రయ్య గుండె కింది భాగంలో బాణం దిగడంతో అతని పరిస్థితి విషమంగా ఉంది. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.




