పిట్లం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో సాంకేతిక లోపం
నిజామాబాద్,(జనంసాక్షి): పిట్లం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో మంగళవారం సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో ఆ సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు ఏడు గంటలుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే విద్యుత్ సరఫరాలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని గుర్తించి , విద్యుత్ సరఫరా చేసేందుకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు.