Tuesday, 3 November 2026

ప్రేమించిన యువతిపై అత్యాచారం, హత్యాయత్నం

బెంగళూరు: కర్ణాటకలో చిక్కబళ్లాపూర్‌ జిల్లా లోని బాగేపల్లి గ్రామంలో 20 ఏళ్ల యువతిపై ఆమె ప్రియుడు అత్యాచారం చేసి అనంతరం అమెను బావిలో పడేసి హత్యాయత్నం చేశాడు. ఆ ప్రాంతంలోని ఓ గొర్రెల కాపరి బావిలో అపస్మారక స్థితిలో ఉన్న యువతిని గుర్తించి స్థానికులకు సమాచారం అందించగా అమెను బాగేపల్లి తాలూకా ఆసుపత్రిలో చేర్పించారు. అమె కాస్త కోలుకున్న అనంతరం డాక్టర్లు ప్రశ్నించగా పుట్టపర్తి నుంచి వచ్చిన అడ్డప్ప అనే వ్యక్తి తనని ప్రేమించాడని, పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని చెప్పింది. అమె ఫిర్యాదు మేరకు బాగేపల్లి పట్టణ పోలీసులు అడ్డప్పపై కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *