హైదరాబాద్,(జనంసాక్షి): సీఎం కిరణ్‌తో మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో సమైక్యాంధ్ర బహిరంగ సభకు అనుమతిపై సీఎంతో వీరు చర్చించినట్లు సమాచారం. ఈనెల 12-15 తేదీల మధ్య అనంతపురంలో సభ ఉండే అవకాశముందని గంటా శ్రీనివాసరావు తెలిపారు.
హైదరాబాద్‌లో సభ ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామన్నారు. డిప్యూటీ సీఎం దామోద రాజనర్సింహను కలిసి సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలని కోరతామన్నారు.




