Tuesday, 3 November 2026

మధ్యప్రదేశ్‌ మాజీ మంత్రి రాఘవ్‌జీ అరెస్ట్‌

భోపాల్‌(జనంసాక్షి): మధ్యప్రదేశ్‌ మాజీ మంత్రి రాఘవ్‌జీని పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన గత రెండు రోజుల నుంచి అజ్జాతంలో ఉన్నారు. భోపాల్‌లోని కో ఇ ఫిజా ప్రాంతంలో ఒక ప్లాట్‌లో తలదాచుకుంటున్న ఆయన్ని అరెస్ట్‌ చేసినట్లు ఐజీ ఉపేంద్ర తెలిపారు. లైంగిక వేధింపుల ఆరోపణలతో కేసు నమోదు కావడంతో రాఘవ్‌జీ గత వారం మంత్రిపదవికి రాజీనామా చేశారు. రాఘవ్‌జీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆయన ఇంట్లో పనిమనిషి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *