Tuesday, 3 November 2026

రాష్ట్రంలో చురుగ్గా నైరుతి రుతుపవనాలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌లోని బేగంపేట వాతావరణశాఖ తెలిపింది. చత్తీస్‌గఢ్‌ నుంచి తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి పశ్చిమ మధ్య బంగాళఖాతం, ఉత్తర కోస్తా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలంగాణలె పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *