Tuesday, 3 November 2026

డిప్యూటీ సీఎం తో ఎన్నారైలు టెలీకాన్ఫరెన్స్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అంశంపై డిప్యూటీ సీఎం దామోదరరాజనర్సింహతో అమెరికాలోని తెలంగాణ ప్రాంత ఎన్నారైలు బుధవారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తెలంగాణ అంశంపై గత మూడేళ్లుగా నాన్చుతున్నారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం.. ఎట్టకేలకు ఈ అంశంపై తుది చర్చకు పార్టీ కోర్‌ కమిటీ సమావేశానికి తేదీ ఖరారు చేయడంతో రాష్ట్ర నేతల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది.
కోర్‌ కమిటీలో చర్చించడానికి రోడ్‌మ్యాప్‌లు రూపొందించే పనిలో నిమగ్నమైన ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణలకు ఢిల్లీ రావలసిందిగా ఇప్పటికే ఆదేశాలు అందాయి. దాంతో ఎవరికివారు తయదైన వాదనలతో రోడ్‌మ్యాప్‌లకు తుదిమెరుగులు దిద్దుతున్నారు. యూఎస్‌లోని తెలంగాణ ప్రాంత ఎన్నారైలు డిప్యూటీ సీఎం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *