బోయినపల్లి : కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండలం మల్లాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి దేశిరెడ్డి నర్సింహారెడ్డిపై బుధవారం అర్ధరాత్రి దాడి జరిగింది. సోదరుని కుమారుడు రాజు కత్తితో నర్సింహారెడ్డిపై దాడి చేసి తీవ్రంగా గాయ పర్చాడు. నర్సింహారెడ్డిని కుటుంబసభ్యులు కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు.




