Tuesday, 3 November 2026

భారీ వర్షాల కారణంగా వెనుదిరిగిన స్పైన్‌జెట్‌ విమానం

గన్నవరం: భారీ వర్షాల కారణంగా విమాన రాకపోకలకు అంతరాయమేర్పడుతోంది. హైదరాబాద్‌కు వెళ్లిపోయింది. ప్రతిరోజు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి స్పైన్‌జెట్‌ విమానం రాకపోకలు సాగిస్తుంది. ఈరోజు ఉదయం 8గంటలకు గన్నవరం వచ్చినప్పటికీ భారీ వర్షం కురుస్తుండటంతో అధికారులు ఉదయం 8.30గంటలకు విమానాన్ని తిరిగి హైదరాబాద్‌కు మళ్లించారు. విమానంలో 34 మంది ప్రయాణికులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *