Tuesday, 3 November 2026

విజయవాడలో భారీ వర్షం

హైదరాబాద్‌,(జనంసాక్షి): విజయవాడ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లిన స్పైస్‌ విమానం ల్యాండింగ్‌కు గన్నవరం విమానాశ్రయ అధికారులు గురువారం అనుమతించలేదు. ఈ నేపథ్యం ఆ విమానం తిరిగి శంషాబాద్‌ విమానాశ్రయాన్ని చేరింది. దీంతో విజయవాడ వెళ్లవలసిన విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు శంషాబాద్‌ విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *