వరంగల్: సీమాంధ్ర నేతలు రెచ్చగొట్టే ప్రకటనలు మానుకోవాలని, రాష్ట్ర విభజనకు సహకరించాలని చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. వరంగల్‌లో అయన మాట్లాడుతూ… ఢిల్లీలో జరిగే కోర్‌కమిటీ భేటీలో రాష్ట్ర విభజన అంశంపైనే ప్రధానంగా చర్చ ఉంటుందని తెలిపారు. అధిష్ఠానం మదిలో రాయల తెలంగాణ ప్రతిపాదన లేదన్నారు. రాయల తెలంగాణ కేవలం ఎంఐఎం ప్రతిపాదన మాత్రమేనన్నారు.




