నిండుకుండను తలపిస్తున్న కళ్యాణి డ్యాం
నిజామాబాద్,(జనంసాక్షి): జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎల్లారెడ్డి శివారులో కళ్యాణి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో కళ్యాణి డ్యాం నిండుకుండను తలపిస్తుంది. ప్రాజెక్టుకు ఇప్పటి వరకు ఐదు వందల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది.