రాజీనామా వార్తలను ఖండించిన సీఎం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తన రాజీనామాపై వచ్చిన వార్తలను సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఖండించారు. క్రమశిక్షణ గల కార్యకర్తగా సోనియాగాంధీ ఆదేశాలను ఎన్నడూ దిక్కరించనని, సోనియా నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసముందని ఆయన ఓ ప్రయటనలో వెల్లడించారు. మీడియా అనవసర ఊహాగానాలను ఎందుకు ప్రచారం చేస్తుందో అర్థంకావడం లేదని సీఎం అన్నారు.