కాటారం: కాటారం-మహాముత్తారం ప్రధాన రహదారిలోని దౌత్‌పల్లి వాగులో పడి గురువారం రాత్రి ఇద్దరు యువకులు మృతి చెందారు. గురువారం రాత్రి మహాముత్తారం గ్రామానికి చెందిన బోడ భాస్కర్(25), తన సమీప బంధువైన శ్రీనివాస్‌ను తీసుకుని కాటారం నుంచి ద్విచక్రవాహనంపై వెళుతూ వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తూ అందులో పడి కొట్టుకుపోయారు. శుక్రవారం ఉదయం వాగు ఉద్ధృతి తగ్గటంతో వారి మృతదేహాలు బయటపడ్డాయి. స్థానికులు వీరిని గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారమందించారు. సంఘటన స్థలానికి మహాముత్తారం ఎస్సై రాజ్‌కుమార్, తహశీల్దారు నరేందర్ చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.




