వరంగల్,(జనంసాక్షి): తెలంగాణపై కాంగ్రెస్ కోర్ కమిటీ వైఖరి నిరసిస్తూ కేయూలో విద్యార్థి సంఘాలు అందోళనకు దిగాయి. తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాల ఐకాస నేతలు డిమాండ్ చేశారు. అనంతరం హన్మకొండ-కరీంనగర్ రహదారిపై విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు.




