హైదరాబాద్,(జనంసాక్షి): మజ్లిస్ బచావో తహరిక్ (ఎంబీటీ) పార్టీ అధ్యక్షుడు మాలిక్ (61) ఇకలేరు. తీవ్రమైన గుండెపోటుతో ఆయన నిన్న మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. నిన్న మధ్యాహ్నం నమాజ్ తర్వాత ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదం మృతి చెందారు. ఆయనకు భార్య. ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇవాళ ఆయనకు అంత్యక్రియలు జరగనున్నాయి. గతంలో ఆయన భారత వైమానిక దళంలో పనిచేశారు. 1993 లో ఉద్యోగానికి రాజీనామా చేసి ఎంబీటీలో చేరారు. 2002 లో ఆయన ఎంబీటీకి అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు.




