Tuesday, 3 November 2026

ఉత్తరాంధ్రపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం

విశాఖ: ఉత్తరాంధ్ర రక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర కోసం రోడ్‌మ్యాప్‌ అంశంపై విశాఖపట్నంలోని పార్కు హోటల్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ ద్రోణం రాజు శ్రీనివాసరావు, ప్రముఖ పాత్రికేయులు శివశంకర్‌రావు, వరదారెడ్డి, ఆర్‌.వి. రామారావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలోని పరిశ్రమలు, నీటిపారుదల సౌకర్యాలు, రహదారులు, పోర్టులు తదితర అంశాలపై వారు చర్చించారు. తెలంగాణ జిల్లాలతో పోల్చితే ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాయన్నారు. వీటన్నింటిపై సమగ్ర నివేదిక తయారుచేసి ఏఐసీసీ కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌ని కలిసి అందజేస్తామన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ప్రభుత్వ విప్‌ ద్రోణం రాజు శ్రీనివాసరావు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *