Tuesday, 3 November 2026

ఎరువుల వ్యాపారి ఇంట్లో పేలుడు

సత్తెనపల్లి: గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని భావనారుషి నగర్‌లో నివాసం ఉంటున్న ఎరువులు, పురుగు మందుల వ్యాపారి పెరుమాళ్ల హనుమాన్‌ ప్రసాద్‌ నివాస గృహంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఇంటి ముందు భాగంలో ఉన్న సుమారు 100 పురుగుల మందు డబ్బాలు కాలం చెల్లడంతో పేలి ఉంటాయని అనుమానిస్తున్నారు. ఇంటి ముందున్న గేటు వద్ద ఈ పేలుడు చోటుచేసుకుంది. దీంతో ప్రసాద్‌ ఇంటితోపాటు సమీపంలోని అరు గృహాల గోడలు తలుపులు దెబ్బతిన్నాయి. పేలుడు జరిగే సమయంలో ప్రసాద్‌తోపాటు ఆయన భార్య సామ్రాజ్యం, మనుమడు పవనేష్‌ ఇంట్లో ఉన్నా అందరూ సురక్షితంగా ఉన్నారు. పేలుడుకు అసలు కారణం తెలియరాలేదు. దీనిమీద దర్యాప్తు చేస్తున్నట్లు పురుగుల మందు కెమికల్స్‌ను పరీక్షకు పంపినట్లు సీఐ యు. శోభన్‌బాబు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *