Tuesday, 3 November 2026

కాంగ్రెస్‌ పార్టీ మరోమారు మోసం చేసింది తెలంగాణ విద్యార్థి పరిషత్‌

హైదరాబాద్‌: కోర్‌ కమిటీ పేరుతో తెలంగాణను మరోమరు కాంగ్రెస్‌ పార్టీ మోసం చేసిందని తెలంగాణ విద్యార్థి పరిషత్‌ అరోపించింది. యూపీఏ ఛైర్‌పర్సస్‌ సోనియాగాంధీ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ కూడలి వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ‘డిసెంబర్‌ 9’ ప్రకటనకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని, కమిటీల పేరుతో మరోసారి మోసం చేయాలని చూస్తే తీవ్రపరిణామాలు తప్పవని విద్యార్థి నాయకులు హెచ్చరించారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *