Tuesday, 3 November 2026

నేటి నుంచి ప్రారంభ కానున్న మహంకాళి ఉత్సవం

సికింద్రాబాద్‌: చిరిత్రక సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల సందడి ఆదివారం ప్రారంభం కానుంది. ఈ నెల 28, 29వ తేదీలల్లో నిర్వహించే వేడుకలకు సన్నాహకంగా ఎదుర్కోలు ఉత్సవానికి శ్రీకారం చుట్టనున్నారు. 27వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహించి మరుసటి రోజున అమ్మవారికి బోనం సమర్పణ ఉంటుంది. అనంతరం రంగం, గావు, ముగింపుతో బోనాల ఉత్సవాలు ముగిస్తాయి. ఎదుర్కోలుతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఎదుర్కోలు కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని సికింద్రాబాద్‌ వెస్ట్‌ మారేడుపల్లికి చెందిన కుమ్మరి రత్నయ్య కుటింబీకులు 160 ఏళ్లుగా నిర్వహిస్తుండటం ప్రత్యేకత.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *