Tuesday, 3 November 2026

ధర్మపురి పట్టణంలో ఏడు దుకాణాల్లో అపహరించిన దుండగులు

ధర్మపురి: కరీంనగర్‌ జిల్లా ధర్మపురి పట్టణంలోని పాత పోస్టాఫీస్‌ వీధిలో శనివారం అర్థరాత్రి ఏడు దుకాణాల్లో చోరీ జరిగింది. దుకాణాల తాళాలను పగులగొట్టిన దుండగులు సుమారు రూ. 2లక్షల నగదు, అర తులం బంగారం అభరణాలు, 100గ్రాముల వెండి అపహరించారు. ధర్మపురి పట్టణ ప్రధాన రహదారిపై ఉన్న దుకాణాల్లో చోరీ జరగడం సంచలనం కలిగించింది. ధర్మపురం ఎస్‌.ఐ జగన్‌మోహన్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *