దర్పల్లి గ్రామీణం: నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలోని డొంకల్, గౌరారం, నల్లవెల్లి గ్రామాల్లో శనివారం అర్థరాత్రి మావోయిస్టుల గోడప్రతులు వెలిశాయి. పంచాయతీ ఎన్నికల్లో ఎవరు పోటీచేసిన వారిని శిక్షిస్తామని, ఈ ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయవద్దని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న డిచ్‌పల్లి సీఐ శ్రీశైలం గ్రామాల్లో పర్యటించి గోడప్రతులను తొలగించారు. ప్రజలు భయభ్రాంతులకు గురవకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో పాల్గొన వచ్చని సీఐ వివరించారు.




