హైదరాబాద్: పర్యావరణాన్ని కాపాడుకోవాలని, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ ముందుకురావాలని కోరుతూ సోషల్ కాస్, స్ట్రీమ్ సంస్థలు ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాయి. హుస్సేన్‌సాగర్ బుద్ధ విగ్రహం వద్ద నిర్వహించిన చిత్రలేఖనం పోటీలో నగరంలోని ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. టీ షర్టులపై విద్యార్థులు వేసిన చిత్రాలు పలువుర్ని అకట్టుకున్నాయి. ఇలాంటి కార్యక్రమాల ద్వారా వచ్చిన నిధులను పేద పిల్లల విద్యాభ్యాసానికి ఖర్చు చేయనున్నట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు.




