కాటారం: కరీంనగర్ జిల్లా కాటారం మండలం ధన్వాడ ప్రధాన రహదారిలోని 63/1 కల్వర్టు వద్ద బాంబుస్క్వాడ్ సిబ్బంది మందు పాతరను వెలికితీశారు. మంథని మండలం అడవిసోమన్‌పల్లి నుంచి కాటారం వరకు 38 కల్వర్టులను తనిఖీ చేశారు. మంత్రి శ్రీధర్‌బాబు సొంత గ్రామమైన ధన్వాడ సమీపంలోని కల్వర్టు వద్ద మందుపాతర లభ్యమైనట్లు వారు తెలిపారు. తనిఖీల్లో సిబ్బంది శ్రీనివాస్‌రెడ్డి, కరుణాకర్, నర్సింగం, ప్రొహిబిషన్ ఎస్సైలు పాల్గొన్నారు.




