వర్గల్ : మెదక్ జిల్లా వర్గల్ మండలం మీనాజీపేట గ్రామంలో అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. దత్తారం యాదయ్య (35) అనే రైతు భార్యాపిల్లలు లేని సమయంలో ఇంట్లో ఉరి వేసుకున్నాడు. గౌరారం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వ్యవసాయ భూమిలో వేసిన బోర్ పడకపోవడంతోపాటు అప్పులు పెరిగిపోవడం కారణంగా యాదయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.




