హైదరాబాద్: తెలంగాణకు ప్యాకేజీ ఇవ్వాలని ముఖ్యమంత్రి చెప్పడం భావ్యం కాదని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. లగడపాటి అంటున్న స్టార్ బ్యాట్స్‌మెస్ ఎవరో చెబితే తాము తగిన బౌలర్‌ను రంగంలోకి దించుతామని సవాల్& విసిరారు. తమకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి సీమాంధ్రకు ప్యాకేజీ ప్రకటించాలని సూచించారు. తెలంగాణ వస్తే తన దుకాణం తెరాస అధినేత కేసీఆర్ అందోళన చెందుతున్నారని విమర్శించారు.




