Tuesday, 3 November 2026

ఆదిలాబాద్‌ జిల్లాలో భారీ వర్షాలు

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆదలాబాద్‌ జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షానికి బేల మండలం పాటన్‌ గ్రామ శివారులో లారీ ఇరుక్కుపోయింది. మహారాష్ట్ర – ఆంధ్రప్రదేశ్‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
కాగా, ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి కారణంగానే రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం తెలిపింది. తీరం వెంబడి పశ్చిమ దిశగా గంటకు 45 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని వెల్లడించారు. వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడన ఏర్పడే దిశగా వాతావణంలో మార్పులు కనిపిస్తున్నాయని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *