హైదరాబాద్: ఆహార భద్రత బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఆహార భద్రత అర్డినెన్స్‌ను తీసుకొచ్చిందని అరోపించారు. తెలంగాణ విషయంలో కేంద్రానికి చిత్తశుద్ధి లేదని కమిటీలతో కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణపై పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెడితే మద్దతు ఇచ్చేందుకు భాజపా సిద్ధంగా ఉందన్నారు.




