Tuesday, 3 November 2026

చైనాలో భారీ వర్షాల బీభత్సం వల్ల వంద మందికిపైగా మృతి

బీజింగ్‌: చైనాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా వేర్వేరు ఘటనల్లో వంద మందికిపైగా మృతి చెందారు. వందలాది మంది గల్లంతయ్యారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టి సుమారు 400 మందిని రక్షించారు. పలు ప్రాంతాల్లో వంతెనలు, రహదారులు తెగిపోవడంతో జనజీవనం స్తంభించిపోయింది. మరో రెండు రోజుల పాటు భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *