Tuesday, 3 November 2026

ఆర్టీసీ బస్సులో పొగలు….. పరుగులు తీసిన ప్రయాణికులు

మధిర : ఖమ్మం జిల్లా మధిర అంబేద్కర్‌ సెంటర్‌లో మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సులో పొగలు రావడంతో ప్రయాణికులు పరుగులు తీశారు. బస్సులోని బ్యాటరీలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే పొగలు వ్యాపించాయని డ్రైవర్‌ తెలిపారు. భీమవరం నుంచి 70 మంది ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు మధిర వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 30 నిమిషాల పాటు బస్సును అంబేద్కర్‌ సెంటర్‌లోనే నిలిపి వేశారు. అనంతరం మరమ్మతు కోసం బస్సును మధిర డిపోకు తరిలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *