తిరుమల: తిరుమల శ్రీవారికి వార్షికోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యమైన సాలకట్ల ఆణివారి ఆస్థానం ఈరోజు ఉదయం ఘనంగా ప్రారంభమైంది. ఆణిమాసం చివరి రోజు ప్రతి ఏటా ఈ ఆణివారి ఆస్థానాన్ని నిర్వహిస్తారు. స్వామివారికి భక్తులు సమర్పించే కానుకలు, ఆదాయ వ్యయాలు, నిలువలు మొదలగు వార్షిక లెక్కలను స్వామి వారి ముందు ఉంచారు.




