Tuesday, 3 November 2026

మావోయిస్టుల పేరుతో వాల్‌ పోస్టర్లు

సదాశివనగర్‌: నిజామాబాద్‌ జిల్లా సదాశివనగర్‌ మండలంలో పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలంటూ మండలంలోని రామారెడ్డి గ్రామంలో మావోయిస్టుల పేరుతో పోస్టర్లు వెలిశాయి. స్థానిక నాయకులు ఎన్నికల్లో పాల్గొంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సమాచారం తెలుసుకున్న సదాశివనగర్‌ ఎస్సై నవీన్‌కుమార్‌ రామారెడ్డి గ్రామానికి చేరుకుని పోస్టర్లను తొలగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *