Thursday, 5 November 2026

650 లీటర్ల బెల్లం ఊటను 40 లీటర్ల సారాయి పట్టివేత

జనం సాక్షి :కొల్లాపూర్ రూరల్ మార్చి 16
కొల్లాపూర్ ఎక్సైజ్‌ సర్కిల్ పరిధిలోని మారేడుమాన్ దీన్నే తాండ చంద్రబండ తండా యాపట్ల తండా ముక్కిడిగుండం తండాలో జాయింట్ ఐడీ దాడులు నిర్వహించారు కొల్లాపూర్ ఎక్సైజ్‌ సీఐ ఏడుకొండలు ఆధ్వర్యంలో ముందస్తు సమాచారంతో 650 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు 40 లీటర్ల సారాయి మద్యం స్వాధీనం చేసుకున్నారు మరియు ఎనిమిది కేసుల్లో 8 మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు ఇకపై నాటు సారా తయారు చేసినా, విక్రయించినా ఉపేక్షించేది లేదని కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని, అటువంటివారు పద్ధతి మార్చుకోవాలని తండా వాసులను హెచ్చరించారు.కొల్లాపూర్ ఎక్సైజ్‌ సీఐ ఏడుకొండలు ఈ దాడులలో కొల్లాపూర్ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏ మరియు బీ పోలీస్ అధికారులు ఎస్ టి ఎఫ్ పోలీస్ బృందం పాల్గొన్నారు