హైదరాబాద్: దేశంలో అత్యధికంగా విద్యుత్తు ఛార్జీలు రాష్ట్రంలోనే ఉన్నాయని ఈఆర్సీ తాత్కాలిక చైర్మన్ శేఖర్ రెడ్డి అన్నారు. విద్యుత్తు సంస్థల ఖర్చులను పరిశీలించే ఆడిటర్ల నియామకం వినియోగదారుల ప్రయోజనం కోసమని, డిస్కంలు చేసే లెక్కలన్నీ తమకు చూపించి ఛార్జీలు పెంచమంటే కుదరదని ఆయన అన్నారు. ఆడిటర్లతో జమా ఖర్చులు పరిశీలన చేస్తే తమకు ఆర్థికభారం అవుతుందని డిస్కంలు పేర్కొన్నాయి.




