హైదరాబాద్,(జనంసాక్షి): మాజీ మంత్రి శంకర్‌రావుకు హైకోర్టులో ఊరట లభించింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డిజిపి దినేష్ రెడ్డిలపై ఆయన చేసినట్లు ఆరోపిస్తున్న అనుచి వ్యాఖ్యలపై పోలీస్ విచారణను వారం రోజులపాటు నిలిపివేయాలని హైకోర్టు స్టే విధించింది. ఈ కేసుకు సంబంధించి విచారణ నిలిపివేయాలని కోరుతూ శంకర్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు విచారణపై వారం రోజులు స్టే విధించింది.
ఇదిలా ఉండగా,మాజీ మంత్రి శంకర్‌రావు, ఆయన కుమార్తెపై పెట్టిన కేసును ఆయన కోడలు వంశీప్రియ ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. గతంలో రావు, ఆయన కుమార్తె తదితరులు తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే కేసులో పోలీసులు ఆయనను విచారించారు. అయితే, తాజాగా వంశీప్రియ తన వాళ్లపై దాఖలుచేసిన ఫిర్యాదును ఉపసంహరించుకుంటూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో శంకర రావుపై కేసును హైకోర్టు కొట్టేసింది.




