హైదరాబాద్,(జనంసాక్షి): గ్రామ పంచాయతీలు 1000 వరకు ఏకగ్రీవం కావచ్చని అంచనా ఉందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. అందులో సగం పంచాయతీలను కాంగ్రెస్ మద్దతుదారులు గెలుచుకుంటారన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే కొనేళ్లపాటు హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచాలని కోరినట్లు తెలిపారు. చిన్న రాష్ట్రాల్లో నక్సలిజం పెరుగుతుందనే వాదన సరికాదన్నారు. అధిష్ఠానానికి ఇచ్చిన నివేదికలో రాజకీయ అంశాలు ప్రస్తావించలేదని చెప్పారు.




