హైదరాబాద్: అక్షయ గోల్డ్ ఫామ్స్ అండ్ మిల్లర్స్ పేరిట జరుగుతున్న మోసాలపై ప్రకాశం, ఒంగోలు, చీరాలలో సీఐడీ కేసులు నమోదు చేసింది. సంస్థ ఎండీ హరనాథ్‌బాబు సహా 9 మందిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. మెదక్, అనంతపురం, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో ఆస్తులను సీఐడీ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. సంస్థకు చెందిన 145 బ్యాంకు ఖాతాల్లోని 10.30 కోట్లు జప్తు చేశారు.




