Tuesday, 3 November 2026

అధికార లాంఛనాలతో కోటగిరి అంత్యక్రియలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి శనివారం నిర్ణయించారు. ఈ మేరకు పశ్చిమగోదావరి జిల్లా అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. అయితే కోటగిరి విద్యాధరరావు శనివారం తెల్లవారుజామున తీవ్ర గుండెపోటుతో మరణించారు. కోటగిరి అంత్యక్రియలు ఆయన స్వగ్రామం కామవరపు కోట మండలం తూర్పు యడవల్లిలో జరుగనున్నాయి. ఇప్పటికే కోటగిరి మృతదేహాన్ని ఆయన కుటుంబసభ్యులు స్వగ్రామమైన తూర్పు యడవల్లి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *