Tuesday, 3 November 2026

సంజయ్‌దత్‌కు జైలులో వైద్య పరీక్షలు

పుణె,(జనంసాక్షి): ఎరవాడ జైలులో ఉన్న బాలివుడ్‌ నటుడు సంజయ్‌దత్‌కు వైద్యులు శనివారం నాడు జైలులోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. షెడ్యూలులో భాగంగానే వైద్య పరీక్షలు చేశామని, ఆయనను ఇతర ఖైధీల్లాగా బయట ఆస్పత్రికి తీసుకురావడం సాధ్యం కాదు కాబట్టి జైలులోనే పరీక్షలు చేసినట్లు అధికారులు తెలిపారు. సంజయ్‌దత్‌ అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని వారు పేర్కొన్నారు. దత్‌తో పాటు అదే జైలులో ఉన్న ఆయన స్నేహితుడు యూసుఫ్‌ నల్వాలాకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించగా ఆయన పలు అనారోగ్యాలతో బాధపడుతున్నట్లు తెలిసిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *