హైదరాబాద్,(జనంసాక్షి): కృష్ణా జిల్లా అవనిగడ్డ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య కుమారుడు శ్రీహరిప్రసాద్(హరిబాబు) పేరును టీడీపీ ఖరారు చేసింది. అంబటి బ్రాహ్మణయ్య కుటుంబ సభ్యులు ఈ ఉదయం టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును కలిశారు. వారి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత హరిబాబును అభ్యర్థిగా ఖరారు చేశారు. అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి ఆగస్టు 21 న ఉప ఎన్నిక జరగనుంది.




