Tuesday, 3 November 2026

అసెంబ్లీ కంప్యూటరీకణకు కేంద్రం గుర్తింపు

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర శాసన సభను కంప్యూటరీకరణ చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు ఇవాళ స్వీకర్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. శాసనసభకు గ్రాంట్‌గా రూ. 1.6 కోట్ల నిధులను మంజూరు చేసిందని ఆయన అన్నారు. దీన్ని మిషన్‌మోడ్‌ ప్రాజెక్టుగా కేంద్రం ఎంపిక చేసింది. ఇది దేశంలోనే మొదట తరహా ప్రాజెక్టు అని పేర్కొన్నారు. ఇకపై శాసనసభ వ్యవహారాలన్ని పూర్తిగా కంప్యూటర్‌ విధానంలోనే జరుగుతాయని వెల్లడించింది. త్వరలో తెలుగులోనూ శాసనసభ వెబ్‌సైట్‌ను తీసుకొస్తామని మనోహర్‌ అన్నారు. పద్దెనిమిది నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని కేంద్రం కోరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *