Tuesday, 3 November 2026

హుస్సేన్‌సాగర్‌కు ముప్పులేదు: కమిషనర్‌ కృష్ణబాబు

హైదరాబాద్‌,(జనంసాక్షి): హుస్సేన్‌సాగర్‌కు ప్రస్తుతానికి ఎలాంటి ముప్పు లేదని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎంటీ కృష్ణబాబు తెలిపారు. హుస్సేన్‌సాగర్‌ నిండిపోయిందని, ఏక్షణంలోనైనా అది పొంగి ప్రవహించి, దిగువనున్న అశోక్‌నగర్‌, గాంధీనగర్‌, ఇందిరాపార్కు, దోమలగూడ లాంటి ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉందని గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితిని కృష్ణబాబు వివరించారు. ఇప్పటికిప్పుడు ఇబ్బంది లేకపోయినా తక్కువ సమయంలో భారీ వర్షాలు పడితే మాత్రం ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. హుస్సేన్‌సాగర్‌కు గేట్లను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను నీటి పారుదల శాఖకు పంపించామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *