Monday, 2 November 2026

ఎంపీ ఇళ్లముందు ధర్నా: ఏపీఎన్టీవోలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పార్లమెంట్‌ సభ్యులు ఇళ్లముందు ఈ నెల 29 న ధర్నాలు చేయనున్నట్లు ఏపీ ఎన్‌జీవోల సంఘం నాయకులు తెలిపారు. సమైక్యాంధ్రకే కట్టబడి ఉండాలంటూ ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద మహాధర్నా చేస్తామన్నారు.

సమైక్యాంధ్ర సాధన కోసం హైదరాబాద్‌లో త్వరలో సన్నాహక సమావేశం  జరుగుతుందని, అలాగే విశాఖ, తిరుపతి, విజయవాడ, కడప, అనంతపురాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్ర విభజనకు ఎట్టి పరిస్థిల్లో అంగీకరించేది లేదని ఏపీ ఎన్‌జీవోలు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *